పోయిన లేదా చిరిగిపోయిన 10 వ తరగతి సర్టిఫికెట్ తిరిగిఎలా పొందాలి | How to Get Lost SSC Certificate

How to Get Lost SSC Certificate?

ప్రతి విద్యార్థి జీవితం లో 10 వ తరగతి అనేది మొదటి మెట్టు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎటువంటి ఉద్యోగానికి ఐన పదవ తరగతి అనేది ముఖ్యమైన అర్హత గా మారిన  నేపథ్యంలో కొంతమంది అభ్యర్థులు తమ పదవ తరగతి సర్టిఫికెట్ పోగొట్టుకోవడం గాని చిరిగిపోవడం గాని లేదా కాలిపోవడం గాని జరుగుతుంది. అలంటి వారు ఆ సర్టిఫికెట్ ను తిరిగి ఏ విధంగా పొందాలో మేము ఇక్కడ క్లియర్ గా వివరించాము. మేము ఇక్కడ చెప్ప్పిన సూచనలు పాటించినట్లయితే మీ సర్టిఫికెట్ ను సులభం గా పొందవచ్చు.
ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 అప్లై చేసే అభ్యర్థులు గుర్తుపెట్టుకోవలసిన విషయాలు ఏంటి ? 

How to Pay Challan Online?

how to pay online challan for lost ssc certificate

1.ముందు గా bseap.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ఫారం ను డౌన్లోడ్ చేసుకోండి.

2. అప్లికేషన్ ఫారం లో ఉన్న రెండవ పేజీ లో మీ యొక్క వివరాలను తప్పులు లేకుండా రాసి మీ యొక్క పాస్ పోర్ట్ ఫోటో ను అంటించి పాఠశాల హెడ్ మాస్టర్ తో సంతకం చేయించాలి.

3. అదే పేజీ లో ఉన్న ప్రొఫెర్మా 50/- రూపాయల స్టాంప్ పేపర్ మీద నోటరీ చేయించాలి

2. 10 వ తరగతి సర్టిఫికెట్ ను తిరిగిపొందడానికి 250/- చలన ఆన్లైన్ లోనే కట్టవలసి ఉంటుంది అది ఎలానో ఇక్కడ చుడండి.

3.చలన కట్టడానికి మీరు https://cfms.ap.gov.in లోకి వెళ్ళాలి .

వెబ్ సైట్ లోకి వెళ్లిన తర్వాత అక్కడ Receipts Links లోకి వెళ్లి అక్కడ “Citizen Challan”  మీద క్లిక్ చెయ్యాలి

మీకు పైన కనిపిస్తున్న “Department”  మీద క్లిక్ చెయ్యండి అక్కడ “ESE-03 Government Examinations Dept” మీద క్లిక్ చేసుకోవాలి

4. ఇప్పుడు  ” Service” మీద క్లిక్ చేయండి అక్కడ “1043 Issue of Duplicate Pass Certificate to SSC & other Minor Exams Passed Candidates” సెలెక్ట్ చేసుకోవాలి తరువాత సబ్మిట్ చేసినట్లయితే మీకు ఒక ఫారం ఓపెన్ అవుతుంది ఆ వివరాలు అన్ని ఫిల్ చేసి 250/- ఫీజు చెల్లించాలి . తర్వాత మీకు వచ్చే పేమెంట్ రశీదును ప్రింట్ తీసుకోవాలి .

How to File FIR for Lost SSC certificate

ఇప్పుడు మీరు ఒకవేళ మీ సర్టిఫికెట్ పోయినట్లయితే మీకు దగ్గర లో ఉన్న పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చి FIR కాపీ ను తీసుకోవాలి . ఒకవేళ మీ సర్టిఫికెట్ కాలిపోయిన చిరిగిపోయిన దానికి సంబందించిన కాపీ కనుక మీ దగ్గర ఉంటె ఎటువంటి కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు .ఇప్పుడు మీరు మొదటగా తీసుకున్న అప్లికేషన్ ఫారం ను ఎటువంటి తప్పుడు లేకుండా పూర్తి చేసి కింద మేము ఇచ్చిన అడ్రస్ కు పంపించినట్లైతే 15-30 రోజుల్లో మీరు ఏ పాఠశాల లో ఐతే మీ పదవ తరగతి చదివారో ఆ పాఠశాల కు మీ సర్టిఫికెట్ వస్తుంది కాబట్టి 15 రోజుల తరువాత మీ పాఠశలకు వెళ్లి సర్టిఫికెట్ మీద మీ హెడ్ మాస్టర్ తో సంతకం పెట్టించుకుని సర్టిఫికెట్ తీసుకోవచ్చు

అప్లికేషన్ ఫారం తో పాటు పంపించవలసిన డాకుమెంట్స్..

1.Fillled Application Form

2. FIR Copy (In case your Certificate  damaged Attach Damaged Certificate)

3.Payment Challan

4. Head Master Signed Copy

5.50/- Rupees Notary

పంపవలసిన చిరునామా

“Directorate of Government Examinations,

D. No. 20-124, Opposite Andhra Hospitals, Gollapudi,

Vijayawada, Andhra Pradesh – 521225”

దీనికి సంబంధించి పూర్తి వివరాలతో మా ఛానల్  లో  వీడియో చేయడం జరిగింది . ఆ వీడియో మా యొక్క “DIGITAL BADI YOUTUBE CHANNEL” లో మీరు చూడొచ్చు

 


 Lost SSC Certificate – FAQ (తరచూ అడిగే ప్రశ్నలు)

1. SSC సర్టిఫికెట్ పోయితే ఏమి చేయాలి?

మీ SSC సర్టిఫికెట్ పోయినట్లయితే, మీరు Duplicate SSC Certificate కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం అప్లికేషన్ ఫారం, చలాన్ పేమెంట్, FIR కాపీ వంటి డాక్యుమెంట్స్ అవసరం.

2. Lost SSC Certificate కోసం అప్లికేషన్ ఫారం ఎక్కడ దొరుకుతుంది?

మీరు bseap.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి Duplicate SSC Certificate అప్లికేషన్ ఫారం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

3. Duplicate SSC Certificate కోసం ఎంత ఫీజు చెల్లించాలి?

Duplicate SSC Certificate పొందడానికి ₹250/- ఫీజు ఆన్లైన్ చలాన్ ద్వారా చెల్లించాలి.

4. Lost SSC Certificate చలాన్‌ను ఆన్లైన్‌లో ఎలా చెల్లించాలి?

  1. https://cfms.ap.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లాలి
  2. Receipts LinksCitizen Challan క్లిక్ చేయాలి
  3. Department లో ESE-03 Government Examinations Dept సెలెక్ట్ చేయాలి
  4. Service లో 1043 – Issue of Duplicate Pass Certificate to SSC ఎంపిక చేయాలి
  5. వివరాలు ఫిల్ చేసి ₹250/- పేమెంట్ చేసి రశీదు ప్రింట్ తీసుకోవాలి

5. SSC సర్టిఫికెట్ పోయినప్పుడు FIR తప్పనిసరిగా అవసరమా?

✔️ పోయినట్లయితే – దగ్గరలోని పోలీస్ స్టేషన్‌లో FIR ఇవ్వాలి
చిరిగిపోయినా / కాలిపోయినా – FIR అవసరం లేదు, దెబ్బతిన్న సర్టిఫికెట్ కాపీ సరిపోతుంది

6. అప్లికేషన్ ఫారంలో Head Master సంతకం అవసరమా?

అవును. అప్లికేషన్ ఫారంలో ఫోటో అంటించి, మీరు చదివిన పాఠశాల Head Master సంతకం తప్పనిసరి.

7. 50 రూపాయల నోటరీ ఎందుకు అవసరం?

అప్లికేషన్ ఫారంలో ఉన్న ప్రొఫార్మాను ₹50 స్టాంప్ పేపర్‌పై నోటరీ చేయించాలి. ఇది తప్పనిసరి డాక్యుమెంట్.

8. అప్లికేషన్‌తో పాటు ఏ డాక్యుమెంట్స్ పంపాలి?

  • Filled Application Form
  • FIR Copy (లేదా Damaged Certificate Copy)
  • Online Payment Challan Receipt
  • Head Master Signed Copy
  • ₹50/- Notary Paper

9. అప్లికేషన్ ఎక్కడికి పంపాలి?

Directorate of Government Examinations,
D. No. 20-124, Opposite Andhra Hospitals,
Gollapudi, Vijayawada,
Andhra Pradesh – 521225

10. Duplicate SSC Certificate ఎంత రోజుల్లో వస్తుంది?

సాధారణంగా 15–30 రోజుల్లో మీరు చదివిన పాఠశాలకు సర్టిఫికెట్ వస్తుంది.
15 రోజుల తర్వాత పాఠశాలకు వెళ్లి Head Master సంతకం తీసుకుని సర్టిఫికెట్ పొందవచ్చు.

11. ఈ ప్రక్రియపై వీడియో గైడ్ ఉందా?

అవును. పూర్తి వివరాలతో వీడియోను DIGITAL BADI YouTube Channel లో చూడవచ్చు.

 

Join Digital Badi WhatsApp Channel

Daily updates 🚀

Join Now

Subscribe Digital Badi on YouTube

Govt Job Updates,Syllabus 🎯

Subscribe