EPFO e-Nomination Process in Telugu Easy – Step by Step 2026 | EPFO Nomination Online ఎలా ఫైల్ చేయాలి?

EPF అకౌంట్ ఉన్న ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా చేయాల్సిన ముఖ్యమైన పని EPFO e Nomination. ఇది చేయడం వల్ల ఉద్యోగి మరణించిన సందర్భంలో PF, Pension, Insurance లాంటి ప్రయోజనాలు కుటుంబ సభ్యులకు త్వరగా అందుతాయి.

ఈ ఆర్టికల్‌లో మనం Employees’ Provident Fund Organisation (EPFO) e-Nomination ఎలా ఫైల్ చేయాలో స్టెప్-బై-స్టెప్‌గా(STEP B STEP Process) తెలుసుకుందాం.


EPFO e-Nomination అంటే ఏమిటి?

EPFO e-Nomination అనేది మీ Provident Fund (PF) మరియు Pension (EPS) డబ్బులు ఎవరు పొందాలి అనే వివరాలను ఆన్లైన్‌లో నమోదు చేసే విధానం.

👉 ఇది కనుక మీరు చేయకపోతే:

  • PF క్లెయిమ్ ప్రాసెస్ ఆలస్యం అవుతుంది

  • అదనపు డాక్యుమెంట్లు అవసరం అవుతాయి

  • కుటుంబ సభ్యులకు ఇబ్బందులు ఎదురవుతాయి


EPFO e-Nomination ఎందుకు ముఖ్యము?

  • కుటుంబానికి ఆర్థిక భద్రత

  • PF & Pension త్వరగా పొందే అవకాశం

  • పూర్తిగా ఆన్లైన్ ప్రక్రియ

  • ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది


EPFO e-Nomination చేయడానికి అవసరమైనవి

  • UAN నంబర్
  • UANకు లింక్ అయిన మొబైల్ నంబర్
  • ఆధార్ కార్డ్
  • ఆధార్ కార్డు కు లింక్ ఐన మొబైల్ నెంబర్
  • నామినీ వివరాలు (భార్య/భర్త/పిల్లలు/తల్లిదండ్రులు)
  • నామినీ ఫోటో

EPFO e-Nomination ఎలా ఫైల్ చేయాలి? (Step-by-Step Guide)

Step 1: EPFO Member Portal లో Login అవ్వండి

epfo login page

👉 https://unifiedportal-mem.epfindia.gov.in

  • UAN నంబర్

  • పాస్‌వర్డ్  (పాస్వర్డ్ తెలియకపోతే Forget Password option లోకి వెళ్ళండి)

  • Captcha ఎంటర్ చేసి Login అవ్వండి


Step 2: e-Nomination Option సెలెక్ట్ చేయండి

epfo enomination page

  • Dashboard లో Manage క్లిక్ చేయండి

  • అక్కడ e-Nomination పై క్లిక్ చేయండి

(Note : ముందుగా మీ ప్రొఫైల్ సెక్షన్ లోకి వెళ్లి మీ ప్రొఫైల్ లో ఫోటో మరియు అడ్రస్ వివరాలు పూర్తి చేయాలి.)


Step 3: Family Details నమోదు చేయండి

epfo having family page

  • “Have Family?” అన్న ప్రశ్నకు Yes / No ఎంపిక చేయండి

  • కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయండి


Step 4: Nominee Details నమోదు చేయండి

epfo add nominee

  • నామినీ పేరు

  • సంబంధం (Relation)

  • షేర్ శాతం (మొత్తం 100% ఉండాలి)


Step 5: Nominee Photo Upload చేయండి

  • ఫోటో అప్‌లోడ్ చేసి

  • వివరాలు సరిచూసుకుని Save EPF Nomination క్లిక్ చేయండి


Step 6: Aadhaar OTP ద్వారా Submit చేయండి

  • వివరాలు సేవ్ ఐన తర్వాత e-sign మీద క్లిక్ చేయాలి అక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి SEND OTP మీద క్లిక్ చేయాలి
  • ఆధార్‌కు లింక్ అయిన మొబైల్‌కు OTP వస్తుంది
  • OTP ఎంటర్ చేసి Submit చేయండి

✅ మీ EPFO e-Nomination విజయవంతంగా పూర్తయింది


EPFO e-Nomination చేసిన తర్వాత లాభాలు

  • PF క్లెయిమ్ త్వరగా ప్రాసెస్ అవుతుంది

  • Pension ప్రయోజనాలు సులభంగా అందుతాయి

  • కుటుంబానికి ఆర్థిక భద్రత ఉంటుంది


ముఖ్యమైన సూచనలు

  • పెళ్లి అయిన తర్వాత Nomination తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలి.

  • పిల్లలు పుట్టిన తర్వాత కూడా వివరాలు మార్చాలి.

  • ఆధార్ & మొబైల్ UANకు లింక్ అయి ఉండాలి.


FAQ – తరచూ అడిగే ప్రశ్నలు

Q1: EPFO e-Nomination తప్పనిసరిగా చేయాలా?
అవును, అన్ని ఉద్యోగులకూ ఇది చాలా అవసరం.

Q2: మొబైల్ లేకుండా e-Nomination చేయవచ్చా?
లేదు, OTP కోసం మొబైల్ నంబర్ అవసరం.

Q3: ఒకరికి కంటే ఎక్కువ నామినీలను ఇవ్వవచ్చా?
అవును, కానీ మొత్తం షేర్ 100% కావాలి.


ముగింపు(Conclusion)

EPFO e-Nomination అనేది ప్రతి ఉద్యోగి చేయాల్సిన అత్యంత ముఖ్యమైన ప్రక్రియ.

ఇది కేవలం కొన్ని నిమిషాల్లో పూర్తవుతుంది కానీ మీ కుటుంబానికి పెద్ద భద్రతను ఇస్తుంది.

👉 ఈ సమాచారం ఉపయోగపడితే మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి.

ఆధార్–పాన్ లింక్ చేయడం ఎలా? (Aadhaar PAN Link Telugu Guide)

Join Digital Badi WhatsApp Channel

Daily updates 🚀

Join Now

Subscribe Digital Badi on YouTube

Govt Job Updates,Syllabus 🎯

Subscribe

1 thought on “EPFO e-Nomination Process in Telugu Easy – Step by Step 2026 | EPFO Nomination Online ఎలా ఫైల్ చేయాలి?”

Leave a comment