ఆంధ్రప్రదేశ్ లో 10,000 పోస్టులతో DSC నోటిఫికేషన్
AP DSC NOTIFICATION 2024

ఆంధ్రప్రదేశ్ లో పోస్టులతో సంక్రాంతి తర్వాత DSC నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ విద్య శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో 2018 తర్వాత ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. 2018 అప్పటిలో అధికారం లో ఉన్న TDP ప్రభుత్వం సుమారు 8 వేల పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసి 2019 లో పరీక్షలు నిర్వహించింది. ఆ తర్వాత వచ్చిన YCP ప్రభుత్వం అర్హత సాదించినవారికి ఉద్యోగాలు ఇచ్చింది. ఐతే 2019 లో అధికారం లోకి వచ్చిన YCP ప్రభుత్వం 20 వేల పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించింది. కానీ ఇప్పటికి 5 ఏళ్ళు గడుస్తున్నా ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. ప్రతిసారి నోటిఫికేషన్ ఇస్టాము అన్న ప్రకటనలు చేస్తున్నారు కానీ ఇప్పటివరకు నోటిఫికేషన్ ఐతే ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యం లో ఇప్పుడైనా నోటిఫికేషన్ విడుదల చేస్తారు అని వేలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు వేచిచూస్తున్నారు. ఈ సమాచారం ఫై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.
జిల్లాల వారీగా ఖాళీలు :
AP DSC DISTRICT WISE VACANCIES LIST
శ్రీకాకుళం 126
విజయనగరం 65
విశాఖపట్నం 334
తూర్పు గోదావారి 1221
పశ్చిమ గోదావరి 448
కృష్ణ 43
గుంటూరు 507
ప్రకాశం 415
నెల్లూరు 340
చిత్తూర్ 818
కడప 401
కర్నూల్ 3442
అనంతపురం 206
గమనిక : ఈ ఖాళీలు కేవలం ఇంతకముందు అసెంబ్లీ లో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఇచ్చిన స్టేట్ మెంట్ ప్రకారం చెప్పబడినవి. ఇవి ఫైనల్ కాదు. ఇంతకుమించి పోస్టులు పెరగవచ్చు తగ్గవచ్చు.
విద్యార్హతలు :
AP DSC EDUCATIONAL QUALIFICATIONS
నోటిఫికేషన్ తేదీ నాటికీ B.Ed or D.Ed పూర్తి చేసి ఉండాలి. అలాగే ఇప్పటివరకు నిర్వహించిన ఏదైనా టెట్ పరీక్షలో అర్హత సాధించి ఉండాలి.
B.Ed చేసినవారు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అలాగే D.Edచేసినవారు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అర్హులు.
గమనిక : B.Ed చేసినవారు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు మాత్రమే అర్హులు, వారు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అర్హులు కారు.
APPSC GROUP 2 NOTIFICATION 2024
వయస్సు :
AP DSC AGE LIMIT
ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే నోటిఫికేషన్ నాటికీ 18 నుండి 42 సంవత్సరాలు వయస్సు కలిగి ఉండాలి. బీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు అలాగే యస్సి, ఎస్టీ అభ్యర్థులకు 5సంవత్సరాలు, దివ్యంగులకు 10 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
పోయిన లేదా చిరిగిపోయిన 10 వ తరగతి సర్టిఫికెట్ తిరిగిఎలా పొందాలి 2024
పరీక్షా విధానం :
AP DSC EXAM PATTERN
సెకండరీ గ్రేడ్ టీచర్(SGT)
AP DSC SGT EXAM PATTERN
జనరల్ నాలెడ్జి మరియు కరెంట్ అఫైర్స్ – 10 మార్కులు
విద్య దృక్పధాలు – 05 మార్కులు
విద్య మనోవిజ్ఞాన శాస్త్రం – 10 మార్కులు
కంటెంట్ మరియు మెథడాలజీ – 75(50+25)మార్కులు
మొత్తం మార్కులు : 100 మార్కులు
పరీక్షా పత్రం తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం లో ఆబ్జెక్టివ్ టైపు లో ఉంటుంది. ఇందులో ఎటువంటి నెగటివ్ మార్కులు ఉండవు.
అప్లికేషన్ ఫిజూ :
AP DSC APPLICATION FEE
అప్లికేషన్ ఫీజు 500/- ఉంటుంది. ఈ ఫీజు ఆన్లైన్ ద్వారా మీ యొక్క డెబిట్ కార్డు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు.
సార్…జిల్లాల వారీగా ఖాళీలను దేని ఆధారంగా చెప్పగలిగారు….!
Age relaxation penchandi pls