ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 అప్లై చేసే అభ్యర్థులు గుర్తుపెట్టుకోవలసిన విషయాలు ఏంటి ?
GROUP 2 NOTIFICATION 2023
Appsc Group 2 Notification Out Now
ఏపీపిఎస్సి గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి అందరికి తెలిసిందే. నోటిఫికేషన్ ప్రకారం ఎగ్జిక్యూటివ్ పోస్టులు ౩25 అలాగే నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 521 ఉన్నాయి ఈ నోటిఫికేషన్ ప్రకారం ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే ఉండవలసిన విద్యార్హతలు ,వయస్సు ,పరీక్షా విధానం అలాగే ఆన్ లైన్ ఎలా అప్లై చెయ్యాలో వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం.
విద్యార్హతలు -Group 2 Educational Qualificaions
నోటిఫికేషన్ నాటికీ అంటే 07-12-2023 నాటికీ మీరు ఏదైనా డిగ్రీ లేదా డిగ్రీ సమానమైన కోర్స్ పాస్ అయి ఉండాలి .
నోట్ : డిప్లొమా డిగ్రీ కింద పరిగణింపబడదు
పోస్టును అనుసరించి విద్యార్హతను కలిగి ఉండాలి
ఏ పోస్ట్ కు ఏ విద్యార్హత అనేది నోటిఫికేషన్ లో గమనించండి.
ఈ పోస్టులకు అప్లై చేయు అభ్యర్థులకు అప్లికేషన్ 250/- రూపాయలు అలాగే ప్రాసెసింగ్ ఫిజూ 80/- రూపాయలు ఉంటుందిSC,ST,PWD వారికీ ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు కానీ 80/- రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి.
పరీక్షా విధానం : Group 2 Exam Pattern
గ్రూప్ 2 పరీక్షా మీకు రెండు దశలలో జరుగుతుంది మొదటిది Preliminary Examination రెండోవాది Mains Examination, Preliminary లో పాస్ ఐనా వారు Mains కు అర్హులవుతారు
Preliminary Examination :
జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ మీద 150 ప్రశ్నలకు 150 మార్కులు ఉంటాయి మీకు ఇందులో నెగటివ్ మార్కులు కూడా ఉంటాయి.
Mains Examination :
ఈ పరీక్షలో మీకు 2 పేపర్స్ ఉంటాయి పేపర్ 1 మరియు పేపర్ 2
పేపర్ 1 లో సోషల్ హిస్టరీ అఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు భారత రాజ్యాంగం మీద ప్రశ్నలు ఉంటాయి. అలాగే పేపర్ 2 లో మీకు ఇండియా మరియు ఆంధ్రప్రదేశ్ ఎకానమీ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ప్రశ్నలు ఉంటాయి దీనిలో కూడా మీకు 1/3 నెగటివ్ మార్క్ ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు : డిసెంబర్ 21 2023 నుండి జనవరి 10 2024 వరకు ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు .
ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ : How to Apply Online Group 2
1. ఈ పరీక్షకు మీరు అప్లి చేయాలి అనుకుంటే ముందు గా OTPR (ONE TIME PROFILE REGISTRATION) అనేది చేసుకోవలసి ఉంటుంది.
2. మీరు ఇంతకుముందే OTPR చేసినట్లయితే డైరెక్ట్ గా మీ యొక్క లాగిన్ డీటెయిల్స్ తో లాగిన్ ఆన్లైన్ అప్లికేషన్ లోకి వెళ్లి గ్రూప్ 2 సర్వీసెస్ కు అప్లై చేయవచ్చు. అప్లై చేయడానికి మీ యొక్క డిగ్రీ సర్టిఫికెట్స్ ఉంటె సరిపోతుంది
3.ఒకవేళ మీరు OTPR చేయాలి అనుకుంటే మీ యొక్క 10TH , ఇంటర్ , డిగ్రీ మరియు ఆధార్ కార్డు ,పాస్ పోర్ట్ సైజు ఫోటో మరియు సంతకం ఉండాలి.
గ్రూప్ 2 సంబంధించి అన్ని వివరాలను అందించాము. మీకు ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్న కింద కామెంట్ చేయండి.
4 thoughts on “APPSC GROUP 2 NOTIFICATION 2024 | ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 అప్లై చేసే అభ్యర్థులు గుర్తుపెట్టుకోవలసిన విషయాలు ఏంటి ?”