E-PAN Card Download ఎలా చేయాలి? | UTI & NSDL Step by Step Telugu Guide 2026

E PAN DOWNLOAD

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పాన్ కార్డు (PAN Card) అనేది ఆర్థిక వ్యవహారాల్లో చాలా ముఖ్యమైన డాక్యుమెంట్.
బ్యాంక్ అకౌంట్, లావాదేవీలు, పన్నుల చెల్లింపు, ఆధార్–పాన్ లింక్ వంటి పనులకి పాన్ కార్డు తప్పనిసరి.

కొన్నిసార్లు పాన్ కార్డు పోగొట్టుకోవడం లేదా విరిగిపోవడం  జరుగుతుంది.
అలాంటి సందర్భాల్లో E-PAN Card (డిజిటల్ పాన్ కార్డు) ని డౌన్‌లోడ్ చేసుకుని ఉపయోగించవచ్చు.

ఈ ఆర్టికల్‌లో  E-PAN Card ఎలా డౌన్‌లోడ్ చేయాలో Step by Step తెలుగులో తెలుసుకుందాం.

E-PAN Card అనేది
Income Tax Department జారీ చేసే
డిజిటల్ పాన్ కార్డు (PDF format)

 ఇది:

  • Original PAN Card లాగానే valid

  • Mobile / Laptop లో సేవ్ చేసుకోవచ్చు

  • అన్ని అధికారిక పనులకు ఉపయోగపడుతుంది

PAN Card ఎవరు జారీ చేస్తారు?

పాన్ కార్డులను ఆదాయపు పన్ను శాఖ జారీ చేసినప్పటికీ
వాటిని ప్రాసెస్ చేసే సంస్థలు రెండు అవి

1️⃣ UTI Infrastructure Technology and Services Limited (UTIISL)
2️⃣ NSDL

 మీ PAN Card ఏ సంస్థ ప్రాసెస్ చేసిందో
సాధారణంగా PAN Card వెనుక భాగంలో ముద్రించి  ఉంటుంది.

 తెలియకపోయినా సమస్య లేదు – రెండు విధానాలూ ప్రయత్నించవచ్చు.

UTI E-PAN Card Download Process (Step by Step)

UTI E PAN CARD DOWNLOAD

Step 1: Google Search ఓపెన్ చేయండి

 Google లో ఇలా టైప్ చేయండి
Download UTI ePAN Card

 మొదట వచ్చే Official Link పై క్లిక్ చేయండి

Step 2: PAN Card Details ఎంటర్ చేయండి

ఫారంలో

  • PAN Card Number నమోదు చేయండి

  • మీ పుట్టిన నెల & సంవత్సరం నమోదు చేయండి

  • Captcha Code ఎంటర్ చేయండి

  • Submit పై క్లిక్ చేయండి

Step 3: OTP Verification చేయండి

👉 మీ PAN Card UTI ద్వారా ప్రాసెస్ అయి ఉంటే

  • స్క్రీన్ మీద

    • PAN కు లింక్ అయిన Mobile Number / Email కనిపిస్తాయి

  • ఏదో ఒకటి Select చేసి
    👉 Send OTP క్లిక్ చేయండి

👉 మీ మొబైల్‌కు OTP వస్తుంది
👉 OTP ఎంటర్ చేసి Submit చేయండి

E-PAN CARD అనేది మీ ఈ-మెయిల్ కు PDF రూపం లో వస్తుంది.

(NOTE : E-PAN CARD DOWNLOAD చెయ్యాలి అంటే తప్పనిసరిగా మీ యొక్క పాన్ కార్డు కు మీ ఈ -మెయిల్ లింక్ అయి ఉండాలి.)

E-PAN Card Password ఏమిటి?

👉 PDF ఓపెన్ చేయడానికి Password అడుగుతుంది

Password = మీ పుట్టిన తేదీ (DDMMYYYY)

ఉదాహరణ:

  • DOB: 15/12/1990

  • Password: 15121990

 UTI E-PAN Download Fee

 ₹8.26 మాత్రమే.

NSDL E-PAN Card Password

Password = DOB (DDMMYYYY)
ఉదాహరణ: 15121990

NSDL EPAN CARD DOWNLOAD

NOTE : ఇదే విధంగ NSDL PAN CARD ను కూడా DOWNLOAD చేసుకోవచ్చు రెండింటికి సంబందించిన లింక్స్ ఈ ఆర్టికల్ చివరిభాగంలో ఇవ్వబడింది.

 NSDL E-PAN Download Fee

   ₹8.26 మాత్రమే

PAN Card ఏ కంపెనీ ప్రాసెస్ చేసిందో తెలియకపోతే?

   UTI & NSDL – రెండింటిలోనూ ప్రయత్నించండి
   ఒకదానిలో తప్పకుండా పని చేస్తుంది


PAN Number తెలియకపోతే ఎలా తెలుసుకోవాలి?

    మీకు PAN Number తెలియకపోతే
    ఆధార్ ద్వారా తెలుసుకోవచ్చు

లేదా సహాయం కోసం
📧 digitalbaditelugu@gmail.com
ఈ మెయిల్‌కు మెసేజ్ చేయండి


Conclusion (ముగింపు )

 E-PAN Card Download చేయడం చాలా సులభం
✔ UTI లేదా NSDL Website ద్వారా
✔ OTP Verification తో
✔ ₹8.26 మాత్రమే ఖర్చుతో

 Original PAN Card లాగే ఇది కూడా 100% Valid

UTI E-PAN CARD DOWNLOAD LINK

NSDL E-PAN CARD DOWNLOAD LINK

ఆధార్–పాన్ లింక్ చేయడం ఎలా 2026? (Aadhaar PAN Link Easy Method Telugu Guide)

 

Join Digital Badi WhatsApp Channel

Daily updates 🚀

Join Now

Subscribe Digital Badi on YouTube

Govt Job Updates,Syllabus 🎯

Subscribe

1 thought on “E-PAN Card Download ఎలా చేయాలి? | UTI & NSDL Step by Step Telugu Guide 2026”

Leave a comment